క్యాబినెట్‌ను విస్తరించిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తన క్యాబినెట్‌ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్‌ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 35 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.సీఎం మోహన్‌ యాదవ్‌ కొత్తగా క్యాబినెట్‌లోకి తీసుకున్న 28 మందితో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ సీ పటేల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన 18 మందిలో ప్రద్యుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్‌ సింగ్ పటేల్, కైలాస్‌ విజయవర్గీయ, విశ్వాస్ సారంగ్‌ ఉన్నారు. ఆరుగురు స్వతంత్ర హోదా మంత్రులుగా అవకాశం కల్పించారు. మరో నలుగురిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు.కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కాకుండా మరో నేత మోహన్‌ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం సీఎం పదవి కట్టబెట్టింది.

Leave A Reply

Your email address will not be published.