కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి

: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ….‘‘సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు ఏఐసీపీ అగ్రనేత రాహుల్ గాంధీ (ఎందుకు స్పందించలేదు. డీఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలి. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలి. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తాం. తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని కవిత పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.