ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో తెలంగాణ సర్కారు మార్పులు
జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో తెలంగాణ సర్కారు మార్పులు చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనరల్ హాలీడేస్ జాబితాలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1న సెలవు ఇచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించింది.కాగా డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కాబట్టి ఆరోజు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు అలసిపోతారని.. అందుకే వాళ్ల సౌలభ్యం కోసం జనవరి 1న సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా పార్టీలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. క్లబ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు అర్ధరాత్రి ఒంటి గంట కల్లా మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.