అంగన్వాడీలకు కనీసవేతనాలు రూ.32,000 లకు పెంచాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అంగన్వాడీలకు కనీసవేతనాలు రూ.32,000 లకు పెంచాలని ఇంటర్ నేషనల్ హుమెన్ రైట్స్ సివిల్ రైట్స్ చర్మెన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేసారు. అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచాలని  గత 18 రోజులుగా పలనాడు జిల్లా మినుకొండలో నిరాహార దీక్ష చేస్తున్న  అంగన్వాడీ వర్కర్ల కు ఇంటర్ నేషనల్ హుమెన్ రైట్స్ సివిల్ రైట్స్ తరపున మద్దతు ప్రకటించారు.ఈ సందర్బంగా కరణం తిరుపతి నాయుడు మాట్లాడుతూ తెలంగాణా లో ఇటీవల  అంగన్వాడీ వర్కర్ల కు అదనంగా వేతనాలు పెంచారని వారికన్నా ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ జీతాలు పెంచాలని డిమాండ్ చేసారు.అలాగే సుప్రీంకోర్టు తీర్పుప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని,మిని సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.ఐ.సి.డి.యస్.కు బడ్జెట్ పెంచాలి. ప్రీస్కూల్ బలోపేతం చేయాలి.హెల్పర్ల ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి. ప్రమోషన్ వయస్సు 50 సం॥కి పెంచాలి.సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, భీమా ఇవ్వాలి.వైఎస్సార్. సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలి.లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎస్ఆర్ఎస్ను రద్దు చేయాలని,2017 టీఎ బిల్లులు, ఇతర బకాయి బిల్లుల్ని వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో ఇంటర్ నేషనల్ హుమెన్ రైట్స్ సివిల్ రైట్స్ పలనాడు జిల్లా ప్రదాన కార్యదర్శి  కిన్నెర కోటయ్య,సహాయ కార్యదర్శి ఎస్కే బాష తదితరులు పాల్గొన్నారు.నేటి ఈ దీక్ష కార్యక్రమం లో సుమారు 550  మంది అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.