ప్రమాద బాథితునికి వెస్సో ఆర్దిక సహాయం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గుంటూరు జిల్లా తెనాలి నివాసి  మేడూరి సుధాకర్ (48) వడ్రంగి వృత్తిలో ఉన్నారు.  కొద్ది రోజుల క్రితం ఒక ఇంటి పైకప్పు పై రేకులు వేస్తుండగా, రేకులు విరిగి క్రింద పడిపోయారు. వెన్నెముక దెబ్బ తినడం వలన సర్జరీ కొరకు ఆసుపత్రిలో అడ్మిట్ కాగా, వైద్య పరీక్షల్లో గుండెలో బ్లాక్స్ కూడా ఉన్నట్టు గుర్తించి, వెన్నెముక సర్జరీ తో పాటుగా, గుండెకు రెండు స్టెంట్స్ కూడా వేసారు. రెండు సర్జరీలుా ఆరోగ్యశ్రీ లో జరిగినప్పటికీ, పై ఖర్చుల నిమిత్తం రెండు లక్షలు అప్పు చేశారు. సర్జరీ తదనంతరం వాడే మందుల వేడి కారణంగా నాలుగు రోజుల్లోనే పిస్టుల, పైల్స్ కారణంగా రక్తస్రావం జరిగి, అపస్మారక స్థితిలో తిరిగి మరలా ఆసుపత్రి(ఐసియూ) లో చికిత్స తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స నిమిత్తం అయిన బిల్లు మొత్తాన్ని ఇంకా పూర్తిగా చెల్లించలేదు. బంధువుల ద్వారా వెస్సో గురించి తెలుసుకొని ఆర్థిక సహాయం కోసం వెస్సోను ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో సుధాకర్ కు ₹38500 అందజేసింది. ఈ సందర్భంగా వెస్సో అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ అనారోగ్యంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సుధాకర్ కు సహాయ పడిన గౌరవ దాతలకు పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.