వైఎస్‌ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం

తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్‌ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్‌ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని వెల్లడించారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీకి సిద్ధాంతాలు ఉండాలని అన్నారు.రూ.1200 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి.. రూ.120 కోట్లు మాత్రమే కేటాయించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధికి తన సొంత డబ్బు ఖర్చు చేశానని తెలిపారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని నాలుగేండ్లలో చేసి చూపించానని తెలిపారు. లోకేశ్‌ను ఓడించినప్పటికీ తనకు సహకారం అందకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. తన రాజీనామాను ఆమోదించకపోవడం వాళ్ల ఇష్టం అని అన్నారు. తాను ఏ పార్టీలో చేరినా అదే రోజు తన నిర్ణయం చెబుతానని అన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని గతంలో చెప్పిన నేను.. ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఏపీ సీఎం జగనే సమాధానం చెప్పాలని అన్నారు. తమ పార్టీల్లోకి రావాలని చాలామంది ఆహ్వానించారని కానీ వెళ్లలేదని చెప్పారు. వైఎస్‌ కుటుంబంతోనే ఉన్నానని.. ఎప్పటికీ వాళ్లతోనే ఉంటానని వారి చెప్పానని తెలిపారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్‌ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్‌ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని వెల్లడించారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీకి సిద్ధాంతాలు ఉండాలని అన్నారు.రూ.1200 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి.. రూ.120 కోట్లు మాత్రమే కేటాయించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధికి తన సొంత డబ్బు ఖర్చు చేశానని తెలిపారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని నాలుగేండ్లలో చేసి చూపించానని తెలిపారు. లోకేశ్‌ను ఓడించినప్పటికీ తనకు సహకారం అందకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. తన రాజీనామాను ఆమోదించకపోవడం వాళ్ల ఇష్టం అని అన్నారు. తాను ఏ పార్టీలో చేరినా అదే రోజు తన నిర్ణయం చెబుతానని అన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని గతంలో చెప్పిన నేను.. ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఏపీ సీఎం జగనే సమాధానం చెప్పాలని అన్నారు. తమ పార్టీల్లోకి రావాలని చాలామంది ఆహ్వానించారని కానీ వెళ్లలేదని చెప్పారు. వైఎస్‌ కుటుంబంతోనే ఉన్నానని.. ఎప్పటికీ వాళ్లతోనే ఉంటానని వారి చెప్పానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.