విద్యార్థుల కోసం బస్సులు నడపాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ బస్టాండ్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌ గూడెం శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం బస్సులను తగ్గించి బస్సులు నడుపుతున్నట్టు ప్రజలకు విద్యార్థులకు నమ్మించాలని ప్రయత్నం చేస్తుంది దీని ద్వారా విద్యార్థిని విద్యార్థులు సరైన సమయానికి పాఠశాలలు కళాశాలలకు చేరుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు రెండు రోజుల క్రిందట తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో భాగంగా బాన్సువాడ లోని ఒక ఎగ్జామ్స్ సెంటర్ కు విద్యార్థులు చేరుకోలేకపోవడం ద్వారా 20 మంది విద్యార్థులు పరీక్షలు రాయక తమ యొక్క జీవితాలను ఆర్టీసీ బలిగోన్నదని ఆవేదన చెందుతున్నారు ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రొద్దున 8 నుంచి 9 వరకు సాయంత్రం 4 నుంచి 5 వరకు విద్యార్థులకు అనుకూలంగా బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది డిపో మేనేజర్ ఇందిరా గారు సరైన సమయంలో బస్సులను నడుపుతామని హామీ ఇచ్చారు లేనిపక్షంలో విద్యార్థులు బాన్సువాడ ఉన్న అందరితో డిపో మేనేజర్ ఛాంబర్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హనుతేజ్. జోనల్ ఇంచార్జ్లు జేశ్వంత్, ఆనంద్, అరవింద్ , నాగేష్, అభిషేక్, సిద్దు, అభితెజ్, అజయ్, అరవింద్, అనిల్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.