మెరుగైన సమాజ నిర్మాణంలో విద్యార్థులది కీలకపాత్ర

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విద్య మానవాళికి విజ్ఞానంతో బాటు సంపూర్ణ వికాసాన్ని ప్రసాదిస్తుందని, విద్యార్థులలో నిక్షితమైన అసాధారణ ప్రతిభను వెలికి తీస్తున్న “ప్రేరణ” కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అవకాశమని దీనిని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని శనివారం నాడు హసన్పర్తి మండలం లోని భీమారంలోని కస్తూర్బా విద్యాలయంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రవ్యాప్త ప్రేరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు.విద్య ద్వారానే జీవితంలో ముందడుగు సాధ్యమని, శాస్త్రీయ ప్రణాళిక -పునస్చరణతో విద్యార్థులు పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు చదువుకునే వయసులోనే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు అనే నిచ్చెనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చునని విద్యార్థులు ప్రేరణ వంటి కార్యక్రమాలను సద్వినియోగపరుచుకొని సమాజంలో అసమానతలు పారద్రోలే సామాజిక మార్పుకు విద్యార్థులు సాక్షీభూతం అవ్వాలని దాసు సురేష్ విద్యార్థులకు సూచించారు.బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డా పరికిపండ్ల అశోక్ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం ఇటీవల విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఆధర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినంద నియమన్నారు. సైకాలజిస్ట్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెంపొందించుట కొరకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే అంశంపై ఉచితంగా ప్రేరణ సదస్సులు సైకాలజిస్ట్ల సంఘం సహకారంతో నిర్వహించనున్నామని, విద్యార్థులు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగపరచుకోవాలని, వివరాలకు ఫోన్ నెంబర్ 9989310141 లలో సంప్రదించాలనితెలిపారు. విద్యార్థులు చదువుకునే పద్ధతులు జ్ఞాపకశక్తి మెలకువలు టెన్షన్ అధిగమించే మార్గాలను సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మురళీధర్ రావు,భూపాల్ పల్లి జిల్లా సైకాలజిస్ట్ల సంఘం నాయకులు కుమారస్వామి లతో పాటు కస్తూర్బా విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ స్వప్న , ఉపాధ్యాయ బృందం రజిత,మమత,హెలెన్లతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.