గుర్తింపు, రిజిస్టర్ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆయా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసే సందర్భంలో కేవలం గుర్తింపు పొందిన సంఘాలతో మాత్రమే కాకుండా రిజిస్టర్ సంఘాలను కలిపి సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల సంయుక్త పోరాట సమితి (జేఎస్సి )పక్షాన జేఎస్సి చైర్మన్ తిరువరంగం ప్రభాకర్ విజ్ఞప్తి చేసారు. గత పదేల్ల లో గుర్తింపు పొందిన సంఘాల పేరుతో కొంతమంది నేతలు కోట్లాది రూపాయల పాట్ల దండాలు పైరవీలు తప్ప సామాన్య ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆవగింజంతైన న్యాయం లాభం చేకూర్చలేదని విషయాన్ని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించి తమ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే జాయింట్ స్టాప్ కౌన్సిల్ కానీ మరేదైనా సమావేశం కానీ ఏర్పాటు చేసే సందర్భంలో మాత్రమే గుర్తింపు పొందిన మరియు రిజిస్టర్ సంఘాలను కలిపి ఉమ్మడిగా మాత్రమే సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ ఫ్రేడ్లి ప్రభుత్వంగా మనగలుగుతుందని ప్రభుత్వానికి కూడా మంచి సలహా సూచనలు అందుతాయని పేర్కొన్నారు.కావున ఈ దశలో తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల సంయుక్త పోరాట సమితి పక్షాన ప్రభాకర్ విజ్ఞప్తి చేసారు.

 

 

Leave A Reply

Your email address will not be published.