ప్రతి వ్యక్తికి 2024 నెవర్ బిఫోర్ కావాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పాత సవంత్సరం కు వీడ్కోలు పలికాం..నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాం.ఈ వేళ యువత ఆలోచన కొత్త ప్రణాళికలు ఉన్నత లక్ష్యాన్ని సాధించే లా ఉండాలని,ఆ దిశగా నే పధనిర్దేశం చేసుకోవాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు 2024 సంవత్సరం ప్రారంభం సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి కి జీవితం కాలంలో 365 రోజుల వ్యవధి కాలం సాధారణమైనదని కాదని అభిప్రాయడ్డారు. యువత ఎంతో విలువైన కాలాన్ని కొన్ని అనవసర ఆలోచన తో,చెడు అలవాట్ల స్నేహం తో.. కాలం వెళ్లబుచ్చడం సరికాదన్నారు.ముఖ్యం గా యువ శక్తి..మత్తు కు చిత్తయ్యే బదులు,ఆ మత్తు నే చిత్తు చేయాలన్నారు.ధూమపానం తదితర చెడు అలవాట్ల వల్ల జీవితం లో అవాంఛనీయమైన పరిణామాలు చోటు చేసుకునే లా పరీస్థీతులకు తావివ్వవద్దని,మన దరిదాపుల్లోకి కూడా ఆ దుస్థితి ని రానివ్వ వద్దని సూచించారు.జీవితం లో ప్రతి నిమిషం ఎంతో విలువైoదన్నారు. సమయాన్ని ఒడిసి పట్టే శక్తి మనకు లేదు కాబట్టి,యుక్తి తో సమయాన్ని సద్వినయోగపరచుకుని మనం అనుకున్నది సాధించే లా శ్రమించవచ్చని వివరించారు.అందుకే.. విద్యార్థులు,యువత ను 2024 లో వారు ఎంచుకున్న విద్యా అవకాశాల్లో,అయా రంగాల్లో విజయ పథం లో దూసుకెళ్లాలి అని ఆకాoక్షిస్తున్నట్టు తెలిపారు.2024 ను విజయ వంతమైన వత్సరంగా..మలచు కోవాలని ఉధ్భోదించారు. ప్రణాళికా బద్దమైన కార్యాచరణ తో కొత్త సంవత్సరం లో గొప్ప ,గొప్ప విజయాలు సాధించాలని పిలుపు నిచ్చారు. దురలవాట్లతో జీవితం ఆగమాగం చేసుకోవద్దని “మాచన” హితవు పలికారు. భవిష్యత్ భారతం యువత దే నన్నారు. తాము ఏ రంగాన్ని ఎంచుకున్నా..ఆ యా రంగాల్లో అగ్రగామిగా..నిలిచి ఇతరులకు ఆదర్శమవ్వాలన్నారు.కృషి,పట్టుదల,వీటికి తోడు సంకల్ప బలం ఉంటే ఎంతటి భారీ లక్ష్యం ఐనా అవలీలగా అధిగమించవచ్చన్నారు.అనవసరం గా “అతి” ప్రవర్తన తో చెడ్డ పేరు వచ్చేలా..బలాదూర్ వద్దని రఘునందన్ సూచించారు.యువత జల్సా కోసం ఆలోచించడం సహజమే అని.కానీ ఈ జల్సా ల వల్లే కేసుల్లో ఇరుక్కోవడం మంచిది కాదన్నారు.తల్లి దండ్రులు తమ పిల్లల పట్ల విజిలెంట్ గా.. ఉండాలని స్పష్టం చేశారు.2023 వత్సరం నుంచి నేర్చుకున్న జీవిత పాఠాల తో,2024 ను ఓ గొప్ప మేలు మలుపు కు నాంది పలికేలా.. తీర్చి దిద్దు కోవాలని మాచన రఘునందన్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.