తెలంగాణ సీఎంకు శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కొత్త సంవ‌త్స‌రం రోజున సెక్రటేరియట్ లో హంగామా కనిపించింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేత‌లు, ప్ర‌ముఖులు, అధికారులు క‌లిసి కొత్త సంవ‌త్స శుభాకాంక్ష‌లు తెలిపారు.. మంత్రి సీతక్క రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ కు ఇందిరా గాంధీ ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఎం కు విషెస్ చెప్పి మొక్క‌ను బ‌హుక‌రించారు.. స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ , మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే య‌శ‌స్విని త‌దిత‌రులు రేవంత్ కు పూల బొకే ఇచ్చి ఆంగ్ర సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పారు.. అంత‌కుముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన నివాసంలోని సిబ్బంది

Leave A Reply

Your email address will not be published.