ఏడాదిలో 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  ప్రపంచమంతా ఘనంగా కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుతోంది. అయితే అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు మాత్రం ప్రతి ఏటా జనవరి 1 వ తేదీన 16 సార్లు న్యూఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. అదెలా అనుకుంటున్నారా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నిర్ణీత కక్ష్యలో భూమి చుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమించడమే అసలు కారణం.అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌) గంటకు 28 వేల కిలో మీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. దీంతో 90 నిమిషాల్లోనే భూమి చుట్టూ ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒక రౌండ్‌ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు.. 45 నిమిషాల తర్వాత రాత్రిని చూస్తారు.మరోవైపు ఐఎస్‌ఎస్‌ ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతూ ఉంటుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయాన్ని.. 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు కొత్త ఏడాదిని 16 సార్లు స్వాగతం పలుకుతారు. న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకునే అరుదైన అవకాశం వారికి లభిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.