న్యూ ఇయర్ వేల భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాజధాని హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్‌ డ్రైవ్‌ (తనిఖీలు నిర్వహించి మందుబాబుల పనిపట్టారు. హైదరాబాద్‌, సైబరాబా కమిషనరేట్లలో కలిసి 2700కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1500లకుపైగా కేసులు నమోదవగా, సైబరాబాద్‌లో 1241 కేసులు ఉన్నాయి. ఇక రాచకొండలో 517 మందిపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో 3500కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి.సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్‌ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ను ఆదివారం రాత్రి 8 గంటలకే మూసివేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై విమానం టికెట్‌ ఉన్నవారికి మాత్రమే అనుమతించారు.

Leave A Reply

Your email address will not be published.