తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొదటగా ఆయన తిరుచిరాపల్లిలోని భారతిదశన్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌, కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమ అనంతరం త్రిచీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్‌ను ప్రారంభించారు. తిరుచిరాపల్లిలోని బహిరంగ సభలో ఈసందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘విధ్వంసకర ఉష్ణమండల తుఫాను ‘మించౌంగ్‌’ తర్వాత వరదలతో దెబ్బతిన్న తమిళనాడు ప్రజల దుస్థితిని చూసి నేను చాలా బాధపడ్డాను. ఈ క్లిష్ట సమయంలో కేంద్రం తమకు అండగా ఉంటుందని, వారిని తిరిగి ట్రాక్‌లోని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయ సమకారాలు అందిస్తుంది.’ అని ఆయన హామీనిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, బాధిత నివాసితుల సహాయం, పునరావాసం కోసం కేంద్రం నిధులు కేటాయించాలని మోడీని కోరారు.
కాగా, ఈ సభలోనే మోడీ కొన్నిరోజుల క్రితం మృతి చెందిన హీరో విజరుకాంత్‌కు నివాళి అర్పించారు. ‘కొద్దిరోజుల క్రితమే తిరు విజయకాంత్‌ను కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా కెప్టెన్‌. సినిమాల్లో తనదైన నటనతో ప్రజల మనసులను గెలుచుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.