బహుముఖ ప్రజ్ఞాశాలి కొంగర జగ్గయ్య

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రంగస్థల, సినీ నటుడుగా, రచయితగా, పాత్రికేయుడుగా, పార్లమెంటు పూర్వ సభ్యుడుగా తన ప్రతిభను నిరూపించు కున్న కొంగర జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞా శాలి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్, శ్రీ త్యాగ రాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ త్యాగ రాయ గానసభ లో ప్రముఖ సినీ నటుడు, కళావా చస్పతి, పద్మభూషణ్ డాక్టర్ కొంగర జగ్గయ్య జయంతి వేడుకల సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పాత్రికేయుడు బైస దేవదాసు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పలు సినిమాల్లో కథా నాయకుడుగా, ప్రతి నాయకుడుగా నటించి మెప్పించిన ఘ్క్నత కొంగర జగ్గయ్యది అన్నారు.రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన సాక్రి ఫైన్ నాటకాన్ని బలిదానం పేరుతో తెలుగులోకి జగ్గయ్య అనువదించారని ఆయన పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన విద్యా వేత్త డాక్టర్ లలిత వాణి మాట్లాడుతూ… మేఘం గంభీరమైన కంచు కంఠంతో జగ్గయ్య ఆనాడు ప్రేక్షకుల హృదయాల ను దోచుకున్నారన్నారు. ఎన్టీఆర్, అక్కి నేని సరసన నటించిన మేటి నటుడు జగ్గయ్య పలు చిత్రాల్లో హాస్య హాస్య పాత్రలు పోషించి మెప్పించారని ఆమె పేర్కొన్నారు. 1920లో భారత ప్రభు త్వం జగ్గయ్యకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించిందని ఆమె గుర్తు చేశా రు. ఈ సభలో సినీ గేయ రచయిత మౌన శ్రీ మల్లిక్ మాట్లాడుతూ…. జగ్గయ్య కేవలం సినీ నటుడు మాత్రమే కాదని, పలు రచనలు చేసి తెలుగు సాహిత్యరంగానికి తన వంతు సేవలందించారడని ఆయన పేర్కొన్నారు. విద్యా వేత్త డాక్టర్ రాధా కుసుమ తదితరులు సినీ నటుడు కొంగర జగ్గయ్య నటించిన పలు తెలుగు చిత్రాలలోని పలు పాత్రల గురిం చి వివరంగా మాట్లాడారు. ఈ సంద ర్భంగా సినీనటుడు ఆనంద చక్రపాణినీ, కవి, సినీనటుడు మాయ కుంట్ల నారా యణ రెడ్డిని నిర్వాహక సంస్థ పక్షాన సభలో పాల్గొన్న అతిథులు ఘనంగా సత్కరించి, కొంగర జగ్గయ్య స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలు స్పందన ప్రసంగా లు చేశారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ కవి డాక్టర్ రఘు శ్రీ సభకు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షుడు బి.రామచందర్ రావు, కన్వీనర్ కోకా భవాని తదితరులు సభలో పాల్గొన్నారు. ముందు జరిగిన బహుభాషా కవి సమ్మే ళనంలో దూత రామ కోటేశ్వరరావు, శోభా దేశ్పాండే, గుల్లపల్లి ఆంజనేయులు, డాక్టర్ నాగేశ్వరరావు, ఆర్ ప్రవీణ్, నవనీతరావు, బొల్లి ముంత వెంకటరమణ, జెవి కుమార్ చేకూరి, చంద్రశేఖర్, కేఎల్ కామేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, జి సంపంగి, నరసింహ, గుర్రం మల్లేశం, దైవాదినం, చిక్క రామదాసు, నీలా శ్రీధర్, రమేష్, డాక్టర్ రాధా కుసుమ, తదితరులు పాల్గొన్నారు .పలువురు కవయిత్రులు, కవులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వీయ కవితా గానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.