మదర్ మేరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యము క్షీణిస్తుందని, దీంతో ఇన్ఫెక్షన్ జబ్బులు మరింత త్వరగా దాడి చేయడమే కాదు, అది తీవ్రంగాను పరిణమిస్తుంటాయని మదర్ మేరీ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి హైదరాబాద్ అన్నారు. ప్రకాష్ నగర్ కాలనీలో మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాని వృద్ధాశ్రమములో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వారందరూ ప్రపంచంలోనే అత్యధిక వయోవృద్ధుల జనాభా భారతదేశంలోనే ఉందని, ఇక్కడ దాదాపు 17 కోట్ల మంది వయసు పైబడిన వారు ఉన్నారని, వయోవృద్ధులలో 71% పైగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారని, మిగిలిన 29శాతం నగరాలు, పట్టణాలలో ఉన్నారని, ప్రతి ఐదుగురిలో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారని సాయి చౌదరి తెలిపారు. పెద్దలను ఆదరించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వృద్ధులను అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, దగ్గు, అల్సర్లు, కీళ్ల నొప్పులు, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్ర సంబంధ వ్యాధులు. మధుమేహము, క్యాన్సరు మొదలైన వ్యాధులు ఎక్కువగా వృద్ధుల్లోనే కనిపిస్తున్నాయని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.