ఎర్ర సముద్రం లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు

    హౌతీ రెబల్స్‌ కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్‌ వార్నింగ్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఎర్ర సముద్రం లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న హౌతీ రెబల్స్‌ కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి. దాడులు తక్షణమే ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈ మేరకు 12 దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గతేడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో 23 సరకు రవాణా నౌకలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 దేశాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.