2022-23లో బీజేపీకి అత్యధికంగా రూ.259 కోట్ల విరాళాలు

        అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ నివేదిక    రెండవ స్థానంలో బీఆర్ఎస్ ..రూ.90 కోట్ల విరాళాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంవత్సరానికిగానూ అత్యధిక విరాళాలు సమకూరాయి. రెండో స్థానంలో తెలంగాణకు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ నివేదిక ప్రకారం.. బీజేపీకి 2022-23లో అత్యధికంగా విరాళాలు వచ్చాయి. ఆ పార్టీకి రూ.259 కోట్ల సమకూరాయి. తరువాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు దాదాపు 24.56 శాతం విరాళాలు వచ్చాయి. అంటే అక్షరాలా రూ.90 కోట్లు.రెండు పార్టీలకే అత్యధికంగా విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీఢిల్లీకి చెందిన ఆప్కాంగ్రెస్ పార్టీలు అన్ని కలిపి రూ.17.40 కోట్లు అందుకున్నాయి. వైసీపీ రూ.16 కోట్లుఆప్ రూ.90 లక్షలుకాంగ్రెస్ రూ.50 లక్షలను విరాళంగా పొందింది.ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 70 శాతానికిపైగా బీజేపీకే చేరాయి. మొత్తంగా రూ.363 కోట్లకుపైగా విరాళాల రూపంలో అందినట్లు తెలుస్తోంది. 40 కార్పొరేట్బిజినెస్ సంస్థలు విరాళాలు ఇచ్చిన లిస్టులో ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.