రేషన్ దుకాణాన్ని బినామి ల చేతికి అప్పజెప్పే డీలర్ల పై చర్యలు

 పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రజా పంపిణీ ని ప్రహసనం చేసి,రేషన్ దుకాణాన్ని బినామి ల చేతికి అప్పజెప్పే డీలర్ల భరతం పట్టడం ఖాయం అని..ఆ దిశగా సాంకేతిక పరమైన చర్యలు తీసుకుంటున్నా మని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు శుక్రవారం నాడు ఆయన కందుకూరు లో మాట్లాడుతూ.. నా దుకాణం నా ఇష్టం ఆన్న చందాన చౌక దుకాణాల ను నిర్వహిస్తే..డీలర్ షిప్ రద్దు చేసి,రేషన్ అక్రమాలకు చెక్ పెట్టనున్నట్టు తెలిపారు.జనవరి నెల రేషన్ శనివారం ఆరంభం అవుతోoదన్నారు.రేషన్ డీలర్లు కొందరు, ప్రజా పంపిణీ ని తేలిగ్గా తీసుకుని చౌక దుకాణాలను ఇష్టారాజ్యంగా నడపటం అలవాటు చేసుకున్నారని ఆక్షేపించారు. డీలర్ కాకుండా ఇతరులు రేషన్ దుకాణాల ను నిర్వహిస్తే.. వారిని బినామి లు గా పరిగణించి చట్ట పరమైన చర్యలు తీయుకుంటున్నామన్నారు.అలాగే చౌక దుకాణాల బయో మెట్రిక్ ఈ పాస్ యంత్రాల్లో సైతం బినామి ల భారతం పట్టేలా సాంకేతికంగా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. ఏయే రేషన్ దుకాణాలను ఎవరు నిర్వహిస్తున్నారు ఆన్న విషయం ను ప్రతి దుకాణం తనిఖీ చేసి నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.