భారతి సిమెంట్స్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఈడీ సవాల్ చేసింది. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. భారతి సిమెంట్స్ ఎఫ్‌డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు పొంది ఎఫ్‌డీలను విడుదల చేయాలన్న తీర్పును పున:పరిశీలించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.ఎఫ్‌డీలకు బదులుగా బ్యాంకు గ్యారంటీలను తీసుకున్న తరువాత కూడా ఎఫ్‌డీలను జప్తు చేసుకుందని భారతి సిమెంట్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఎఫ్‌డీలను జప్తు చేసినా కనీసం దానిపైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతీ సిమెంట్స్ మరో పిటీషన్ దాఖలు చేసింది. అయితే భారతీ సిమెంట్స్ ఐఏని కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్‌డీలనే విడుదల చేయాలన్న తీర్పునే పున:పరిశీలించాలనప్పుడు వడ్డీ ఎలా వస్తుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌పై వాదనలు ముగిసినట్లే అని.. అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

Leave A Reply

Your email address will not be published.