అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: డిమాండ్లు పరిష్కారించాలని గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీచేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తెస్తూ జీవో నంబర్‌.2ను విడుదల చేసింది. అదేవిధంగా సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. రూ.3 వేలు తగ్గించి రూ.8050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది.వేతనాల పెంపు సహా ఇతర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు డిసెంబర్‌ 11న సమ్మె బాటపట్టారు. సమ్మెను విరమింప జేసేందుకు ప్రభుత్వం వారితో రెండు పర్యాయాలు జరిపిన చర్చలు విఫమయ్యాయి. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.