టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకు సడెన్‌గా తెరుచుకున్న విమానం డోరు
గాలిలో కొందరి చేతుల్లో బయటకు వెళ్లిపోయి ఫోన్లు..ప్రయాణికులు అంతా సేఫ్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకు ఆ విమానం డోరు సడెన్‌గా తెరుచుకున్నది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో ఉన్న ప్రయాణికులు ఆ వీడియోలు తీశారు.విమానం నుంచి ఎగ్జిట్ డోరు వేరైనట్లు తెలుస్తోంది. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ నుంచి ఏఎస్1282 విమానం టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్ తర్వాత విమానం డోరు ఊడిపోవడంతో దాన్ని వెంటనే దీంచేశారు. పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.ఈ ఘటన గురించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు అలస్కా ఎయిర్‌లైన్స్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. విమానం డోరు తెరుచుకున్న సమయంలో ప్రయాణికుల వద్ద ఉన్న ఫోన్లు గాలిలో ఎగిరిపోయాయి. డీప్రెజర్ కావడంతో కొందరి చేతుల్లో ఉన్న ఫోన్లు బయటకు వెళ్లిపోయాయి. ఒక చిన్న పిల్లోడి షర్ట్ కూడా ఊడిపోయింది. అయితే ప్రస్తుతం ప్రయాణికులు అంతా సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.