ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడులు, ఆన్‌లైన్‌ గేమ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటికి పైగా నగదు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.సైబర్‌ క్రైమ్‌ విభాగం రెండు కీలకమైన కేసులను చేధించిందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డఫాబెట్‌ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి నిందితులు మోసాలు చేస్తున్నారని తెలిపారు. ఓ వ్యక్తి డఫాబెట్‌లో రూ. 70లక్షలు పెట్టి ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారని.. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేశారని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. హరియాణాకు చెందిన హితేశ్‌ గోయల్‌ మోసాల్‌ చేశాడని.. నిందితుణ్ని ఢిల్లీలో అరెస్టు చేశామని తెలిపారు . నిందితుడి నుంచి రూ.1.40 కోట్ల నగదు సీజ్‌ చేశామని తెలిపారు.యూనిటీ స్టాక్స్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని హైదరాబాద్‌ సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు రూ3.16 కోట్లు నష్టపోయానని ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు. నిందితుడు రోనక్‌ తన్నాను అరెస్టు చేశారని తెలిపారు. రోనక్‌ తన్నా దుబాయ్‌ నుంచి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. నిందితుల బ్యాంక్‌ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్‌ చేశామన్నారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారని అన్నారు. నిందితుడు 95 బ్యాంకు ఖాతాలు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.