బిల్ కిస్ భానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:

గుజ‌రాత్ స‌ర్కార్‌కు షాకిచ్చింది సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసులో అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఆ కేసులో 11 మంది రేపిస్టుల‌ను ముంద‌స్తుగా రిలీజ్ చేయాల‌న్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. గుజ‌రాత్ స‌ర్కార్ ఇచ్చిన క్ష‌మాభిక్ష‌ను కోర్టు ర‌ద్దు చేసింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి ఆ అధికారం లేద‌ని ఇవాళ సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర్న‌త‌ఉజ్వ‌ల్ భూయాన్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువ‌రించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటీష‌న్‌కు అర్హ‌త ఉంద‌ని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది.

రేప్ నిందితుల‌కు క్ష‌మాభిక్ష పెట్టే అర్హ‌త గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి లేద‌నిఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఉంద‌నిఎందుకంటే అక్కడే ఆ కేసులో విచార‌ణ జ‌రిగింద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానో రేప్‌కు గురైంది. ఆ స‌మ‌యంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. ఆ కేసులో శిక్ష ప‌డ్డ 11 మంది నిందితుల్ని 2022లో స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేశారు.

క్ష‌మాభిక్ష ద్వారా రిలీజైన వారిలో జ‌వ్వంత్ నాయిగోవింద్ నాయిశైలేశ్ భ‌ట్‌రాథేశ్యామ్ షాబిపిన్ చంద్ర జోషికేశ‌రిభాయ్ వోహ‌నియాప్ర‌దీప్ మోర్దియాబాకాభాయ్ వోహ‌నియారాజుభాయ్ సోనిమిటేశ్ భ‌ట్‌ర‌మేశ్ చంద‌న ఉన్నారు. జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభ‌వించిన త‌ర్వాత రిలీజైన‌ట్లు గుజరాత్ హోంశాఖ కార్య‌ద‌ర్శి రాజ్ కుమార్ గ‌తంలో తెలిపారు. రిలీజైన త‌ర్వాత ఆ 11 మందికి హీరోల త‌ర‌హాలో వెల్క‌మ్ ద‌క్కింది. అయితే రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు మ‌రికొంత మంది సుప్రీంను ఆశ్ర‌యించారు.

ఇవాళ విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ నాగ‌ర‌త్న .. గుజ‌రాత్ ప్ర‌భుత్వం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ అధికారాల‌ను గుజ‌రాత్ అప‌హ‌రించిన‌ట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. క్ష‌మాభిక్ష‌ను ఇవ్వ‌డం అంటే అధికారాల‌ను గుజ‌రాత్ స‌ర్కార్ కిడ్నాప్ చేసిన‌ట్లే అని తెలిపారు. మ‌హారాష్ట్ర అధికారాన్ని గుజ‌రాత్ లాగేసుకున్న‌ట్లు ఆమె త‌న తీర్పులో వివ‌రించారు. అయితే గుజ‌రాత్ స‌ర్కార్ త‌న ప‌రిధిలో ఉన్న అధికారాన్ని వాడుకున్న‌ట్లు కోర్టు తెలిపింది. గుజ‌రాత్ స‌ర్కార్ ఇచ్చిన క్ష‌మాభిక్షను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్ల‌డించింది.

ఒక‌వేళ రేప్ కేసు నిందితులు చ‌ట్టం ప్ర‌కారం క్ష‌మాభిక్ష పొందాల‌నుకుంటేవాళ్లు మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని కోర్టు తెలిపింది. రెండు వారాల్లోగా మ‌ళ్లీ నిందితులంద‌రూ జైలులో హాజ‌ర‌వ్వాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పును డ్రాఫ్ట్ చేసిన జ‌స్టిస్ భుయాన్‌కు జ‌స్టిస్ నాగ‌ర‌త్న థ్యాంక్స్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.