మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కొంపల్లి మోహన్ రెడ్డి వినతి పత్రం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కొంపల్లి మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందచేయడం జరిగింది. అందుకు బాజాపా చీఫ్ కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గత 40 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీకి మరియు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ ప్రతినిత్యం ప్రజలతో మమేకం అవుతూ మేడ్చల్ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయోధ్య నగర్, దత్తాత్రేయ నగర్,వాజపేయి నగర్ వంటి అనేక కాలనీలను నిలబెట్టుటకై అక్రమంగా అరెస్టులు చేసి ఆరు రోజులుగా జైలులో నిర్బంధించినా రాజీ లేని పోరాటంతో వాటిని సాధించారు, జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ సమస్య కొరకై ఢిల్లీకి వెళ్లి గ్రీన్ ట్రిభ్యునల్ లో కేసు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకు వచ్చి ఆ డంప్ యార్డ్ కి క్యాపింగ్ వేయించిన ఘనత కొంపల్లి మోహన్ రెడ్డి గారిదే, హిందూ ధర్మ రక్షన కోసం అయోధ్య రామ మందిర విషయములో ప్రముఖంగా సుప్రీం కోర్టులో దాఖలు అయిన కేసు విషయంలో 12 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తిగా కొంపల్లి మోహన్ రెడ్డి గారు సుపరిచితులు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయములో తన వంతు పాత్రగా రాష్ట్ర బీజేపీ అగ్ర నాయకులతో కలిసి ఆనాటి పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ సుస్మా స్వరాజ్ ని కలిసి తెలంగాణ రాష్టం ఆవశ్యకత,ప్రాధాన్యతలను వివరించిన పిమ్మట తదుపరి ఆనాటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సుస్మా స్వరాజ్ పార్లమెంట్ లో మద్దతు తెలుపడం జరిగింది, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా తదుపరి రాష్ట్ర బాజాపా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనుభవం కలిగి ఉన్న నాయకులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రజలతో మమేకమవుతూ కార్యకర్తలను మరియు నాయకులను సమనవ్య పరుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని రాష్ట్ర నాయకత్వంలో తనకంటూ స్థానం మరియు గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉన్నందుననే రాబోయే పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపేందుకు మల్కాజ్ గిరి నుండి ఎంపీ టికెట్ ఇవ్వడానికి రాష్ట్ర నాయకత్వం సముచితంగా ఉందని యోచిస్తోంది. స్థానిక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు, కార్యకర్తలు మరియు నాయకుల సంపూర్ణ మద్దతుతో అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.