మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతల మాట్లాడుతున్న తీరు సరిగా లేదని , ప్రజలకు బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కె. మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ లు అన్నారు. టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతల మాట్లాడుతున్న తీరు సరిగా లేదు, ప్రజలకు బీజేపీ నేతలు మాయమాటలు, చెబుతున్నారు, న్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందని బీజేపీ నేతలు కుట్రలు చెస్తున్నారు, అంబానీ ఆదానీ ల డబ్బులతో బీజేపీ గెలుద్దామనుకుంటోందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు, ఉపఎన్నిక ఎందుకు తెచ్చారనే దాని పై బీజేపీ నేతలు సరైన కారణం చెప్పలేక పోతున్నారు, ఒక పక్క అంబానీ ఆదానీ లు, మరో ప్రక్క ed ..బీజేపీ రెండు పక్కల నుంచి మునుగోడు లో చెలరేగుతోంది, ప్రజలు మునుగోడు లో బీజేపీ ని ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు అన్నారు. కారు ను పోలిన గుర్తులు వద్దంటున్నా కేటాయించేలా చేసి బీజేపీ తొలి కుట్రకు తెర లేపింది, ఇన్నేళ్ల బీజేపీ పాలన లో మంచి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు దుబ్బాక లో హుజూరా బాద్ లో గెలిచి కూడా హామీలు నిలుపు కోలేని బీజేపీ ఇపుడు మునుగోడు లో అవే హామీలు ఇస్తోంది తెలంగాణ లో మత కల్లోలాలు రేపే కుట్రకు బీజేపీ తెర లేపుతోంది మత ఘర్షణలు రేపి ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీ కి చేతకాదని పేర్కొన్నారు. బీజేపీ కేంద్రం లో చేసింది చెప్పుకోవడం చేతకాకనే కేసీఆర్, ktr ల మీద విమర్శలు చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, కేసీఆర్ నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ ను తరిమారు.. సొరియాసిస్ లాంటి బీజేపీ ని కూడా సాగనంపుతారు. ధర్మం టీ ఆర్ ఎస్ వైపు ఉంది అధర్మం బీజేపీ వైపు ఉంది మునుగోడు లో ధర్మమే గెలుస్తుంది మోడీ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది గ్యాస్ సిలిండర్ యే. పెరిగిన ధరలను గుర్తుంచుకొని బీజేపీ కి బుద్ది చెబుతారు కరోనా వ్యాక్సిన్ ను మోడీ యే కనిపెట్టారని బీజేపీ నేతలు  మాట్లాడుతున్నారు.  మరి నోబెల్ బహుమతి కి ఎందుకు దరఖాస్తు చేసుకోలేదు చేతి వృత్తులని తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకున్నారా తెలంగాణ అంతటి సంక్షేమం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా హైద్రాబాద్ లో బీసీ లకు తెలంగాణ ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నట్టు ఢిల్లీ లో ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు కట్టడం లేదు వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు బీసీ లకు కేటాయించి భవనాలకు నిధులు కేటాయించిన మహనీయుడు కేసీఆర్
రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని బీజేపీ నేతలు చెప్పగలరా
అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీజేపీ కి లేదా కుట్ర తోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చింది మునుగోడు లో ఎదో జరిగితే ఆ పేరు చెప్పి తెలంగాణ ను ఆగం చేయాలని కుట్ర పన్నింది బీజేపీ తెలంగాణ సమాజం బీజేపీ తీరు ను గమనించా అన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ లో భారత్ జోడో యాత్ర ముఖ్యమా.. మునుగోడు ఉపఎన్నిక ముఖ్యమా
అందరూ భారత్ జోడో యాత్ర లో ఉంటే మునుగోడు లో కాంగ్రెస్ కు పని చేసేదేవరు.. బీజేపీ కి సాయం చేయడానికి ఇదో కుట్ర నా అని ప్రశ్నించారు. బీజేపీ ని ఓడించే దమ్ము కాంగ్రెస్ కు లేదు మునుగోడు లో గెలిచిన తర్వాత దేశం లో బీజేపీ ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలు దేరుతారు కేసీఆర్ తర్వాత ఎన్నేళ్ళ కయినా తెలంగాణ కు సీఎం అయ్యేది ktr మాత్రమే
టీ ఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ktr అని ఎవరిని అడిగినా చెబుతారు.. అదే విషయాన్ని నేను చండూరు లో చెప్పాను బీసీ లకు తెలంగాణ లో జరుగుతున్న మేలు దేశం లో మరెక్కడా జరగడం లేదు పవన్ కళ్యాణ్ తెలంగాణ లో పోటీ చేయొచ్చు ఎవరు కాదన్నారు.. చిరంజీవి పార్టీ గతం లో పోటీ చేయలేదా మునుగోడు లో ప్రజలు మా వైపు ఉన్నారు
బీజేపీ ప్రజలను గందర గోళ పరిచే పనిలో ఉంది. మునుగోడు ప్రజలు బీజేపీ ని నమ్మరు ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్
తెలంగాణ లో 134 బీసీ కులాలుంటే అన్నిటికి కేసీఆర్ పాలనలో ఎదో ఒక మేలు జరిగింది దేశం లో మరెక్కడా చేతి వృత్తులకు ఇంతటి ఆదరణ లభించలేదు గొల్ల కురుమలకు 10 వేల కోట్ల రూపాయల తో గొర్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ దే
కొందరు పార్టీ మారక సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్నారు బీసీ గురుకులాల కు కేంద్రం నయా పైసా ఇచ్చింది లేదు
ప్రతి గురుకుల విద్యార్థి పై కేసీఆర్ ప్రభుత్వం లక్షా 20 వేల రూపాయలు వెచ్చిస్తోంది
కేసీఆర్ ఇంతా చేస్తున్నా ప్రతిపక్షాలు రాజకీయం కోసమే బీసీ లకు ఏం చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు
బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ పథకాలను మెచ్చుకుంటున్నారు
కేసీఆర్ పై బురద జల్లే నేతలను మునుగోడు ప్రజలు పట్టించుకోరు అన్నారు. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమం దేశం లో మరెక్కడా అమలు కావడం లేదు మునుగోడు ప్రజలకు కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉంది మునుగోడు లో గెలిచేది టీ ఆర్ ఎస్ మాత్రమే అని వారు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.