నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం

        థర్డ్ ఫ్రంట్ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ వెల్లడి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నూతన రాజకీయ ఆర్ధిక విధానాలతో యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలియాన్స్ థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని చేస్తున్నట్లు థర్డ్ ఫ్రంట్ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో థర్డ్ ఫ్రంట్  నిర్మాణం విధి విదానాలు వివరించారు. ప్రధానంగా జాతీయస్థాయిలోఎన్డీఏ ఇండియా కూటములు ప్రజల ఆయుషు శ్రేయస్సు ఆర్ధిక అభివృద్ధిని పెంపొందించే మార్గదర్శకాలను తెలియజేయకుండా, అధికారం కోసం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు థర్డ్ ఫ్రంట్ ఉండవలసిన వశ్యకతను ఆయన తెలియజేశారు. కేంద్రం చేసిన అప్పు, రాష్ట్రాలు చేసిన అప్పులతో కలుపుకొని ఇప్పటివరకు రెండు వందలఇరవై లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాయని, వాటికి సంవత్సరానికి 16 లక్షల కోట్ల రూపాయలువడ్డీలు కింద చెల్లిస్తున్నాయని అన్నారు. డాలర్ విలువతో పోల్చుకున్నప్పుడు మన రూపాయి విలువ 82 రూపాయలు”ఉందని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా అప్పులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థఅప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని నేటికీ రైతుల పరిస్థితి ఇవాళ రేపు ఎల్లుండి వరకే తమ బాధలు అన్నట్టుఅప్పులు అవమానాలు ఆత్మహత్యలతో నెట్టుకొస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, దాదాపు 35 సంవత్సరాలనుంచి రైతు ఆత్మహత్యలతో ఆర్థిక వ్యవస్థ తన రూపాల్ని మార్చుకొని నిరుద్యోగులు భవన నిర్మాణ కార్మికులువ్యాపారస్తులు బిజినెస్ సర్వీసులు బ్యాంకు ఉద్యోగులను కూడా ఆత్మహత్యలు చేసుకునే దాకా వదలడం లేదనినేటికీ భద్రత ఆర్థిక భద్రత లేని సమాజంలో కుటుంబం మొత్తం ఆత్మహత్యలు హత్యలకు గురౌతున్నాయని ఆవేదనవ్యక్తంచేశారు. మరోవైపు, ఉద్యోగాలు లేక, ఇచ్చిన ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేక, జీతాలు పెంచలేక, పెన్షన్లుసమకూర్చలేక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయిన కాడికి అప్పులు చేస్తూ అవ అవసరమైనప్పుడు ఆస్తులను నమ్మేస్తూఅధిక ధరల భారాన్ని ప్రజల పై మోపి తమ పరిపాలన విధానం ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నాయని అన్నారు.ఈ రెండు కూటముల్లో ఒకటి చట్టసభల్లో చేరి చట్టాలను నిర్వీర్యం చేస్తుంటే, మరొకటి ఉచితంగా ఇస్తామనిపంచుతామని ఆర్థిక అసమానతలను మరింత పెంచడం బాధాకరమని అన్నారు. ఆర్థిక అసమానతలు ఆత్మహత్యలులేని వ్యవస్థ, సాంఘిక అణిచివేతలు హత్యలు జరగని, మెరుగైన సమ సమాజ సమగ్ర అభివృద్ధి కోసం థర్డ్ ఫ్రంట్నిర్మాణం నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో ఆయన తెలియజేశ తెలియజేశారు. ఈ థర్డ్ ఫ్రంట్ లో, లో, కేం కేంద్ర రాష్ట్ర ప్రజలుఎదుర్కొంటున్న వాస్తవసమస్యలకు పక్కకి జరిగి మా థర్డ్ ఫ్రంట్ విధానాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.విదేశాలకు తరలిపోతున్న నల్లధనాన్ని ఆపుతాం. చేసిన అప్పులను సకాలంలో చెల్లిస్తాం. రైతు ఆత్మహత్యలు లేకుండాచేస్తాం. రైతులు వలసలు పెరగకుండా నివారిస్తాం. గ్రామాల సమస్యలు పట్టణాల అవసరాలను నూతన రాజకీయఆర్థిక విధానాలతో ఆర్థిక అసమానతలు ఆత్మహత్యలు లేని వ్యవస్థను నిర్మిస్తాం. వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులుకార్మికులను పరిగణలోకి తీసుకుంటాం. అవసరమైన ఉద్యోగాలను ప్రకటిస్తూ ఇచ్చిన ఉద్యోగాలకు నిర్ణీత తేదీకిఒకసారి జీతాలను పెంచుతాం పెన్షన్లు కూడా న్యాయమైన హక్కుగా అందిస్తాం. వాయు కాలుష్యం కారణంగాదేశంలో ఏడాదికి 20 లక్షల మంది ంది చనిపోతున్నారు కొన్ని కోట్ల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక్కఢిల్లీలోనే సంవత్సరంలో 50 వేల మంది చనిపోయారు, సాధ్యమైనంత వరకు వీటిని జరగకుండా చేస్తాం. వైద్యంగురించి మా ప్రణాళికలో వివరిస్తాం. కుల రహిత వర్గ రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తాం. కరోనా కారణంగాఏడాదికి రెండు మూడు లాక్ డౌన్లు విధించినప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తతీసుకుంటాం. మా విధానాలు ప్రపంచానికి ఆదర్శనీయం అనుసరణీయం గా పరిపాలనను ప్రజలకు అందిస్తాం.ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో చేరాలనుకునే పార్టీలు జనవరి 25 వ తారీకు లోగా చేరితే ప్రజలకు ఎన్నికల ముందేఒక స్పష్టత వస్తుందని, జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అన్ని రాష్ట్రాల ప్రజల అభివృద్ధిని కోరుకునేలా మా థర్డ్ఫ్రంట్ ప్రణాళిక ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశం లో ఐపిసి నేషనల్ ప్రెసిడెంట్ కెబి శ్రీధర్, గొల్లపల్లి దయానంద రావు అడ్వైజర్, పోకల కిరణ్ సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, వెంకటేశ్వర్లు ఐ ఎన్ టి యు సి చైర్మన్, ఉదయలక్ష్మి ఐపిసి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐపిసి నేషనల్ సెక్రెటరీ కట్ట రమేష్ , ఒబిసి విభాగం లాల్ భీమ్, ఒబిసి విభాగం అధ్యక్షులు కొప్పుల విజయ్ బాబు,ఐపిసి ఓబిసి స్టేట్ ప్రెసిడెంట్ నామని భాస్కర్ నేత యూత్ సెక్రెటరీ పీ.సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.