మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణ

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్‌గా స్పందించిందన్నారు. మేడిగడ్డకాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చామన్నారు. మేడిగడ్డలో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తితో జ్యూడిషియల్ విచారణ జరుపుతామన్నారు. మేడిగడ్డపై క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.