22న పాఠశాలలు, లిక్కర్ దుకాణాలు బంద్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అయోధ్యలోని భవ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జాతీయ పండుగగా ఈ వేడుకను అభివర్ణిస్తూ, ఆరోజు మద్యం దుకాణాలన్నీ బంద్ చేయాలని ఆదేశించారు.

 

ప్రతిష్ఠాపన సమయం, తేదీ

 

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జనవరి 16 నుంచి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలియజేసిన సమాచారం ప్రకారం, ప్రధాన మంత్రి, 6,000 మంది ప్రముఖులు ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటారు. వారణాసికి చెందిన ప్రధాన పురోహితుడు లక్ష్మీ కాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. జనవరి 14 నుంచి 22 వరకూ అయోధ్యలో జరిగే ఈ అమృత్ మహోత్సవాలను నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించనున్నారు.

 

ఢిల్లీ-అయోధ్య మధ్య నడిచే రైళ్లు ఇవే…

 

-15559-అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

 

-14206-ఢిల్లీ ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్

 

-12226-కైఫియత్ ఎక్స్‌ప్రెస్

 

-15716-కరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్

 

-13484-ఫరక్కా ఎక్స్‌ప్రెస్

 

-15623-భగత్ కి కోటి కామాక్షి ఎక్స్‌ప్రెస్

 

-14016-సద్భావనా ఎక్స్‌ప్రెస్

 

-15026-ఆనంద్ విహార్ టెర్మినల్ మవూ ఎక్స్‌ప్రెస్

 

-15116-లోక్‌నాయక్ ఎక్స్‌ప్రెస్

Leave A Reply

Your email address will not be published.