ఏబీవీపీ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో గల ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ప్రభుత్వ , కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు ఆటలలో రాణించడం కొరకు జనవరి 12 స్వామి వివేకానంద జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిల సందర్భంగా ఎబివిపి యువజన వారోత్సవాలను జనవరి 18న ప్రారంభం అయి జనవరి 19 తేదీలలో ప్రభుత్వ కళాశాల నందు ఆట పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఏబీవీపీ నిర్వహించే పోటీలు ,క్రికెట్ ఖో ఖో. వ్యాసరచన, డ్రాయింగ్ కాంపిటీషన్స్ జూనియర్ స్థాయిలలో వేరువేరుగా ఆట పోటీలు నిర్వహించి గెలిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హనుటేజ్ జోనల్ ఇంచార్జి సుభాషిచంద్రబాస్ జశ్వంత్ నాగేష్ ఆనంద్ అభిషేక్ అభితేజ్ గణేష్ అజయ్ హన్మాండ్లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.