కుళ్ళు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్న బిజెపి, కాంగ్రెస్ లకు ప్రజలే బుద్ధి చెబుతారు

.... మంత్రి తలసాని

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : కుళ్ళు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్న బిజెపి, కాంగ్రెస్ లకు ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  మునుగోడు ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి మంచి మెజార్టీ సాధిస్తుంది మేం గెలిస్తే 3వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాయి దుబ్బాక, హుజారాబాడ్ లో ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కెసిఆర్ కోరుకున్నారని, అందుకు గొల్ల, కురుమలకు ఆర్థికంగా బలోపేతం కోసం వారికి గొర్రెలను ఇస్తున్నాం. యూనిట్ కాస్ట్ ని కూడా పెంచం… లక్షా ఇరవై అయిదు వేల నుంచి 1,75 వేలకు పెంచాం, బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ స్కీమ్ కొద్ది రోజులు ఆగిపోయింది, మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత యధావిధిగా కొనసాగిస్తాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న గొల్ల, కురుమలు ఆందోళన పడొద్దు, డబ్బుకు రాకుండా ఆపడం బీజేపీ, కాంగ్రెస్ కుట్ర ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు కుదరవు ఎల్లకాలం వీటిని ఆపలేరు… ఎన్నికల కోడ్ తర్వాత మీ డబ్బు మీకు చెందుతుంది. బిజెపి నాయకులు కేంద్రం నుంచి రూపాయి తెచ్చింది లేదన్నారు. ఓ వైపు కంప్లైంట్ ఇచ్చేది మీరే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నా ఇల్లు అమ్మి మీకు ఇస్తా అని మాటలు చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక వచ్చింది బీజేపీ కి ఉన్నది ముగ్గురు మీ వల్ల ఎం అవుతుంది 3 వేళ పెన్షన్ ఎలా ఇస్తావు… మీరు గెలిచిన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అవుతావు… అంతకు మించి ఎం కాదు బీజేపీ వల్ల తప్పకుండా బీజేపీ కి బుద్ది చెప్తారు బల్దియా ఎన్నికలలో పదివేల రూపాయిలు ఇచ్చాం అన్నారు. మేము బీజేపీ మాదిరి కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తాం అని చెప్పలేదు. రైతుబందు, దళిత బందు ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదు మేము గొల్ల, కురుమల ప్రతినిధి గా చెప్తున్న, మీరు దైర్యంగ ఉండండి ఎన్నికలు ముగిసే వరకే అడ్డుకోగలరు…నవంబర్ 6 తర్వాత యధావిధిగా కొనసాగుతుంది. రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీ నాలుగు ఓట్ల కోసం ఎది పడితే అది మాట్లాడేస్తారు బీజేపీ వాళ్లు సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తున్నాయి అవన్నీ నిజం కాదు అన్నారు. డబుల్ బెడ్ రూం అనేది దేశంలో ఎక్కడ లేని స్కీం సిటీ లో ఉపఎన్నిక వస్తుంది అన్న వార్తలు అవాస్తవం… గాలి వార్తలు ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, MLC ఎగ్గే మల్లేశం, MLA లు జైపాల్ యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.