ఆధార్ నమోదు కేంద్రంలో అక్రమ వసూళ్లు…?

అమలుకు నోచుకోని యు ఐ డి ఎ ఐ నిబంధనలు..

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బాన్సువాడ ప్రతినిధి:  ఆధార నమోదు కేంద్రాలలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బాన్సువాడ మునిసిపాలిటీ పరిధిలో మొత్తం నాలుగు ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో రెండు కేంద్రాలు మీసేవ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా మరొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఆధార్ నమోదు కేంద్రంలో కొన్నిటిలో యూ ఐ డి ఎ ఐ నిబంధనలు ఉల్లగించి నిర్ణీత రుసుము కాకుండా అక్రమంగా 150 నుండి 3000 వేల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడు తున్నట్లు వినియోగ దారుల ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీస్ ఎనల్ కార్యాలయం లో కొనసాగుతున్న ఆధార నమోదు కేంద్రంలో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది .0.5 ఏళ్ల లోపు చిన్నారులకు ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ నమోదు చేయాల్సి ఉంటుంది కానీ ఇక్క డ 100 రుపాయలు వసూలు చేస్తున్న ట్లు పలువురు బాహాటంగా పేర్కొంటున్నారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం చిరునామ మార్పుకు సంబంధిత ధృవ పత్ర లు సమర్పించాల్సి ఉంటుంది .సంబంధిత ధృవ పత్రాలు లేని వరకి గెజిటెడ్ అధికారి ధృవీకరణ పత్రం అంటే సరిపోతుంది .దీనిని అవకాశంగా మలుచుకున్న ఆధార నమోదు కేంద్రాల నిర్వహకులు గెజిటెడ్ అధికారి ధృవీకరణ పత్రం తాము తెపిస్తని అందుకుగాను 3000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పలువరు పేర్కొంటున్నారు…అదేవిధంగా కొన్ని మీసేవ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయ పరిధిలో కొన సగల్సి ఉండగా నిబంధనలు ఉల్లంగిచి వారికి అనుమతి ఇచ్చిన చోట కాకుండా ఇతర ప్రదేశాలు ఆధార కేంద్రాలు కొన సాగిస్తున్నారు. ఎది ఏమైనప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఆధార నమోదు కేంద్రాల పని తీరుపై విచారణ చెప్పటి చర్యలు తీసుకోవాలని బాన్సువాడ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.