ముసుగు వేసుకొని ఆసుపత్రికి వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రభుత్వ ఆస్పత్రులు అంటేనే ప్రజలు వెళ్లేందుకు భయపడతారు. అక్కడ చికిత్స సరిగా అందించరని.. చికిత్స సరిగానే ఉన్నా అక్కడ ఉన్న సిబ్బంది ప్రవర్తన నచ్చక ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు. ఇంకా కొన్ని ఆస్పత్రుల్లో అయితే సిబ్బంది అందినకాడికి చేయి చాపి లంచాలు తీసుకుంటూ ఉంటారు. అలా చేతిలో డబ్బు పెడితేనే సమయానికి చికిత్స, మందులు, పడక లభిస్తాయి. లేకపోతే వారి పరిస్థితి చావుకు, బతుకుకు మధ్య కొట్టుమిట్టాడాల్సిందే. అయితే ఇలాంటి ఫిర్యాదులే చాలా సంఖ్యలో జిల్లా డిప్యూటీ కలెక్టర్ వద్దకు వెళ్లాయి. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన డిప్యూటీ కలెక్టర్.. ఎలాంటి అధికారులు, సెక్యూరిటీ లేకుండా మారు వేషంలో ఆ ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. దీంతో ఆమెకు భయంకరమైన నిజాలు తెలిశాయి. దీనిపై ఆ డిప్యూటీ కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.