వైసీపీ గెలుపు కష్టమే

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది ఎవరు?. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ..విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఫోన్లు చేసి మరీ ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఎన్నికలు మే 13 న ముగిసినా ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు ఎదురుచూడాల్సిందే. అంటే ఇంకా 21 రోజుల తర్వాత కానీ అసలు సిసలు ఫలితాలు వెల్లడికావు. అయితే జూన్ 1 న వెల్లడి అయ్యే ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొంత మేర స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. ఉహల పల్లకిలో విహరిస్తూనే ఉంటారు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత ఓటింగ్ శాతం…గెలువు అవకాశాలపై చర్చించుకునే ముందు గత ఎన్నికల లెక్కలను కూడా ఒక సారి చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ నడిచినా కూడా టీడీపీ ఒంటరిగానే దగ్గర దగ్గర 40 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ పై వ్యతిరేకత పెంచే అంశాలు చాలా చాలా పరిమితంగానే ఉంటాయని చెప్పాలి. అదే అధికార వైసీపీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వంపై వ్యతిరేకత కు చాలా చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.