ఇవాళ తగ్గిన పసిడి ధర

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వరుసగా రేట్లు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే నడుస్తోంది. ఇవాళ కూడా పసిడి ధర పతనమైంది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం మరోసారి బంగారం ధరలు పుంజుకున్నాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు.. బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇప్పుడు శుభవార్త. వరుసగా బంగారం రేట్లు పడిపోతున్నాయి.ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజుతో పోలిస్తే ఇవాళ బంగారం ధర భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2370 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ రేటు 30.54 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.40 వద్ద ఉంది.ఇక దేశీయంగా బంగారం రేట్ల విషయానికి వస్తే.. ఇవాళ తగ్గాయని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గి తులానికి ప్రస్తుతం రూ. 66,600 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 220 పతనంతో 10 గ్రాములు రూ. 72,650 పలుకుతోంది. ఇక అంతకుముందు రోజు చూస్తే మాత్రం ఇది వరుసగా రూ. 700, రూ. 760 మేర ఎగబాకింది. దాని కంటే ముందు వరుసగా 3 రోజుల్లో రూ. 400, రూ. 200, రూ. 400 మేర పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు దిగొచ్చింది. ఇక్కడ తులం గోల్డ్ రేటు 22 క్యారెట్స్‌పై రూ. 200 తగ్గి రూ. 66,750 వద్ద కొనసాగుతోంది. ఇంకా 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 220 పడిపోయి తులం రూ. 72,800 వద్ద ఉంది.బంగారం ధరలు పడిపోయిన క్రమంలోనే దేశీయంగా వెండి రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం రూ. 2300 పడిపోయి కిలో రూ. 91,700 మార్కుకు చేరింది. అంతకుముందు రోజు రూ .1200 పెరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. రూ. 2300 తగ్గి ఇప్పుడు కేజీకి రూ. 96,200 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నడుమ బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.