గుండెపోటుతో వ్యక్తి మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో స్పాట్‌లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళితే.. కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో మురళీ అనే వ్యక్తి ఫార్మాసిస్టుగా పని చేస్తున్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు మందుల కోసం దుకాణంలోకి రాగా.. వారికి కావాల్సిన మందులు ఇచ్చాడు. ఆ తర్వాత మెడిసిన్ బిల్లింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. బిల్లింగ్ చేస్తూనే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది అతడికి సపర్యలు చేశారు. ఫిట్స్ వచ్చిందని భావించి.. అతడి చేతిలో ఇనుప వస్తువులు పెట్టి ఉంచాడు. అనంతరం మురళీని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక అతడు గుండెపోటుకు గురికావటం.. క్షణాల్లోనే కుప్పకూలి చనిపోవటం దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.అయితే.. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆకస్మాత్తుగా వచ్చే గుండెపోట్లకు కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోకపోటవం, జంక్ ఫుడ్స్ తినటం వంటి వాటివల్ల హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయన్నారు. రోజూ వ్యాయామం చేయాలని.. యోగ, ధాన్యం, సమతుల ఆహారం తీసుకుంటే గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోచ్చునని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.