తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ట్రైనింగ్ అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి యూనియన్ బ్యాంక్ శుభవార్త వినిపించింది. వారికి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందివ్వనుంది. అయితే ఇది అందరికీ అనుకుంటే పొరబాటే. ఉమ్మడి చిత్తూరు జిల్లావాసులకు యూనియన్ బ్యాంక్ ఈ బంపరాఫర్ ఇచ్చింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువతకు యూనియన్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రేషన్ కార్డు కలిగిన యువతీయువకులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఉపాధి శిక్షణ సంస్థ కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వనుంది. జూన్ పదో తేదీ నుంచి 30 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. ట్రైనింగ్‌లో భాగంగా కంప్యూటర్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌ నేర్పించనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ పీ.సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.ట్రైనింగ్ సమయంలో 30 రోజుల పాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే రానుపోనూ చార్జీలు సైతం అందించనున్నట్లు వెల్లడించారు.

 

అయితే ఈ ట్రైనింగ్ కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల వారికే అందిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు, పురుషులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు. అలాగే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలతో సంప్రదించాలని అధికారులు సూచించారు

Leave A Reply

Your email address will not be published.