రామోజీరావు మృతికి సంతాపం ప్రకటించిన ప్రముఖులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు.. ఈ రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రామోజీరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్న ఆయన.. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌..

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు అచ్చెన్నాయుడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఇక, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల మా ప్రగాఢ సంతాపం అంటూ ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. తెలుగు పత్రికారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు.. ఆసియాలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన ఘనత ఆయనదే.. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు రామకృష్ణ..

Leave A Reply

Your email address will not be published.