చాపమందు పంపిణీ కేంద్రం వద్ద విషాదం

తెలంగాణా జ్యోతి వెబ్ న్యూస్:మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు (జూన్ 8న) ఉదయం 9 గంటలకు.. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. చేప ప్రసాదం తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలున్న బాధితులు తరలివచ్చారు. అయితే.. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైన కాసేపటికే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేప ప్రసాదం కోసం పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో క్యూలైన్‌లలో తోపులాట జరిగింది. అయితే.. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57).. ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్‌లో నిలబడి ఉండగా.. రద్దీ పెరిగి క్యూలైన్‌లో జరిగిన తోపులాటతో స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన సిబ్బంది.. అతన్ని హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు.

శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం.. 24 గంటల పాటు సాగనుంది. ఈ కార్య్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ చేప ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం తీసుకోవటం వల్ల ఆసమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఉపశమనం దొరుకుతుందని ప్రజల నమ్మకం.ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు.. వేల సంఖ్యలో జనాలు నాంపల్లి గ్రౌండ్స్‌కు తరలివచ్చారు.

Leave A Reply

Your email address will not be published.