తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక శనివారం నాడు శ్రీవారిని 79398 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 43567 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.9 కోట్లుగా వచ్చింది. ఇకపోతే జూన్ 18వ తేది నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంభందించిన దర్శన టికేట్లు విడుదల చేయనుంది టిటిడి.

ఇక వచ్చేవారం తర్వాత నుండి పిల్లలకు పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో, అలాగే అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలబడిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులకి పాలు, అల్పాహారం లాంటి వాటిని అందజేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.