గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో తెలంగాణ కొత్త పథకాలపై ప్రశ్నలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గ్రూప్-1 పరీక్షా పత్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలపై ప్రశ్నలు అడగటం గమనార్హం. ముఖ్యంగా.. గృహ జ్యోతి (Gruha Jyothi Scheme), మహాలక్ష్మి పథకాని (Mahalakshmi Scheme) కి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహాలక్ష్మి పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం క్రింది వాటిలో దేనికి సంబంధించి కింది వాటిని పరిగణించండి అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. A. ఈ పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే వర్తిస్తుంది, B. ఈ పథకం అమలుకు అవసరమైన డబ్బును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వార్షిక ప్రాతిపదికన బదిలీ చేస్తుంది, C. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లబ్దిదారులకు చెల్లించాల్సిన సబ్సిడీలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో చెల్లిస్తారు, D. గ్యాస్ సిలిండర్ ధర్ ఎంత అనేది గృహయజమాని లబ్దిదారు గత ఐదు సంవత్సర కాలంలో సగటుగా వాడిన దాని పరిమితిపై ఆధారపడి ఉంటుంది. అంటూ నాలుగు ఆప్షన్లు ఇవ్వగా.. ఇందులో ఎవేవి ఈ పథకానికి వర్తించేవో గుర్తించి సరైన సమాధానం ఎంచుకోవాలని ప్రశ్న ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.