మణికొండ లో బీభత్సం సృష్టించిన కారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి గుడి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 బైక్‌ల వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడే నిలబడి ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.కారు నడిపిన వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కారును, కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కారును నడిపిన వ్యక్తిని మైనర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.కాగా, మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూన్ 1 నుంచి కొత్త రూల్ కూడా అమల్లోకి వచ్చింది. మైనర్‌ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25000 వరకు జరిమానా విధించనున్నారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధిస్తారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.