రాష్ట్రపతి భవన్ లో ప్రత్యక్షమైన జంతువుపై పోలీసులు ఏం చెప్పారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత నెలకొన్న ప్రాంతంలో ఒక జంతువు సడన్‌గా ప్రత్యక్షమైంది. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణం చేసి.. ద్రౌపది ముర్ముకు నమస్కరిస్తుండగా వెనుక భాగంలో ఒక పెద్ద జంతువు నడుచుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది చిరుతగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఢిల్లీ పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగా వెళ్లిన జంతువు.. చిరుత కాదని… పిల్లి అని పోలీసులు తేల్చారు. అయితే పోలీసుల స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత పెద్ద జంతువు వెళ్తుంటే.. పిల్లి అని ఎలా చెబుతారని విమర్శిస్తున్నారు. అయినా ఫారెస్ట్ అధికారులకు పిల్లి నడక ఎలా ఉంటుందో.. చిరుత నడత ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలియదా? అని నిలదీస్తున్నారు. అది కచ్చితంగా చిరుతేనని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.