చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏపీ స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవికు ఆహ్వానం అందింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ ప్రయాణం కానున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

అటు ఏపీ స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ కూడా వెళ్లనున్నారు. కాగా, చంద్రబాబును సభా నాయకుడిగా ఎన్నుకుంది తెలుగుదేశం-జనసేన-బీజేపీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్‌. అంతేకాకుండా తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయ్యారు.ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు.

Leave A Reply

Your email address will not be published.