పుస్తకాల ముద్రణలో చిన్న మిస్టేక్

.. తిరిగి పాఠ్యపుస్తకాలు వెనక్కి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12న స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. అయితే పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా రేవంత్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది.ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మార్చకుండానే ముంద్రించినట్లు తెలిసింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేశారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ చేసిన పుస్తకాలను స్కూళ్లలో టీచర్లు వెనక్కి తీసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.