జైలు నుండి విడుదలైన నటి హేమ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి అరెస్టయిన తెలుగు సినీనటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల ఆమెకు స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం హేమ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా సెక్యురిటీ పోస్ట్‌ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను కన్నడలో ప్రశ్నించగా, ‘బర్త్‌డే పార్టీ’ అంటూ సమాధానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.