రైతు పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటుపై మంత్రి సీరియస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్; కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేటకు చెందిన ఓ రైతు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ధీర్ఘకాలిక రుణం తీసుకున్నారు.పంటలు సరిగ్గా పండకపోవటంతో వడ్డీలతో కలిపి అప్పు రెండింతలైంది. దీంతో రైతు రుణం చెల్లించలేదు. భూమిలో రెండు రోజుల క్రితం నిజామాబాద్‌ డీసీసీబీ లింగంపేట శాఖ అధికారులు జెండాలు పాతారు. ఈ నెల 20న వేలం వేస్తామని నోటీసులు జారీ చేశారు. బ్యాంకు సిబ్బంది నోటీసులు జారీ చేయడంతోపాటు భూమిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.దీనిని నిరసిస్తూ రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పద్ధతులను మానుకోవాలని బ్యాంకు అధికారులను హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా పోల్కంపల్లి ఘటనపై మంత్రి బ్యాంకు అధికారులను ఆరా తీశారు.

Leave A Reply

Your email address will not be published.