రాత్రిపూట హాస్టల్ లో బసచేసిన ఎంపీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. మెట్టవలసలోని హాస్టల్‌ను పరిశీలించారు. రాత్రి పూట అక్కడే నిద్రించి.. హాస్టల్‌లో ఉన్న సౌకర్యాలు, వసతులను పరిశీలించారు. మరోవైపు ఎంపీ చేసిన పనిని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి వెంటనే పూనుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొలువు దీరాయి. అయితే ఇంకా చాలా మంది ప్రజా ప్రతినిధులు.. గెలుపు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్నారు. ఇంకా ఆ మూడ్‌లోనే కొనసాగుతున్నారు. అయితే టీడీపీకి చెందిన ఓ ఎంపీ మాత్రం అప్పుడే డ్యూటీలోకి దిగిపోయారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. అప్పుడే డ్యూటీ మొదలుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మెట్టవలస ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని కలిశెట్టి సందర్శించారు. గురువారం రాత్రి హాస్టల్‎ను తనిఖీ చేసిన టీడీపీ ఎంపీ.. విద్యార్థులతో ముచ్చటించారు. హాస్టల్‌లో ఉన్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హాస్టల్ అధికారులకు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలిసి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అక్కడే బస చేశారు.మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు. సాధారణ రైతు కుటుంబం నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బాల్యంలో ఇదే హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. దీంతో హాస్టల్‌ను ఓ సారి సందర్శించాలనే ఆలోచనతో గురవారం రాత్రి మెట్టవలస హాస్టల్‌లో బస చేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఒకప్పుడు ఈనాడు సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి నియోజకవర్గం లీడర్ స్థాయికి ఎదిగారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడ్డారు.ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఐటీ మంత్రి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించారు కలిశెట్టి అప్పలనాయుడు

Leave A Reply

Your email address will not be published.