సీఎం కేసిఆర్ కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్

సీఎం కేసిఆర్ కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్

సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్ కు రోడ్డు మార్గాన బయలు దేరారు.

అయితే.. సీఎం కేసీఆర్ కాన్వాయ్ జనగాం జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకోగానే.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నేతలు సీఎం. కేసీఆర్కు శాలువ కప్పి స్వాగతం పలికారు. అయితే.. అనంతరం సీఎం కేసీఆర్ కాన్వాయ్ కదులుతుండగా.. మహిళా కానిస్టేబుల్ కాన్వాయ్ లోని ఓ కారులో ఎక్కుతుండగా జారిపడిపోయింది. అయినప్పటికీ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.