కరోనా సెకండ్ వేవ్ సమయంలో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రెండో కోవిడ్‌ సమయంలోనే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే వెల్లడించింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వ్యవసాయేతర రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఈ సర్వే తెలిపింది. అయితే క్రమంగా ఈ రంగం కోలుకుందని, ఈ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా 6 నుంచి 8 శాతానికి పెరిగిందని ఈ (2022-23) సర్వే స్పష్టం చేసింది. కాగా, సెకండ్‌వేవ్‌లో వాణిజ్యం, ఇతర సేవా కార్యకలాపాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నా.. 2021 జులై నుంచి క్రమంగా ఈ రంగాలు పుంజుకున్నాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే తెలిపింది. మొదటి త్రైమాసికంలో చాలా సంస్థల వార్షిక ఆదాయంపై కోవిడ్‌ ప్రభావం చూపింది. సుమారుగా 2021-22 ఏడాదిలో దాదాపు 9.8 కోట్ల మంది కార్మికులు పనిచేసే 5.97 సంస్థల కోవిడ్‌ మహమ్మారి వార్షిక అంచనాలను తలకిందులు చేసిందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తెలిపింది. అయితే కరోనా తగ్గిన తర్వాత అక్టోబర్‌ 2022-మార్చి 2023 మధ్య 11 కోట్ల మంది ఉద్యోగులతో అనధికారిక సంస్థల సంఖ్య 6.5 కోట్లకు పెరిగింది. ఈ సమయంలో ఉద్యోగాల కల్పనలో వార్షిక వృద్ధి 7.84 శాతం పెరిగిందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.